సమాజంలో వివక్ష లేకుండా ట్రాన్స్‌జెండర్ల కు సమగ్ర వైద్యం..: కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

సమాజంలో ఎలాంటి వివక్ష లేకుండా ట్రాన్స్‌జెండర్ల కు సమగ్ర

Update: 2024-12-02 15:15 GMT

దిశ, ఖమ్మం : సమాజంలో ఎలాంటి వివక్ష లేకుండా ట్రాన్స్‌జెండర్ల కు సమగ్ర వైద్యం అందించేందుకు మైత్రి ట్రాన్స్ క్లినిక్ విభాగం ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. సోమవారం ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక వైద్య సేవలందించేందుకు మైత్రి ట్రాన్స్ క్లినిక్ కు కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ హాస్పటల్ నందు ట్రాన్స్ జెండర్స్ తో మాట్లాడారు. ఇక్కడ ఇంకా ఎలాంటి వైద్య సదుపాయాలు కావాల్సి ఉంది అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో ట్రాన్స్‌జెండర్లకు క్లినిక్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇందులో భాగంగా ప్రత్యేక వార్డు, ఓపీ సేవలను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ట్రాన్స్ జెండర్ల కోసం ఏర్పాటు చేస్తిన మైత్రి క్లినిక్ లో ఓపీ సేవలు వైద్యులు అందిస్తారని తెలిపారు.

మైత్రి క్లినిక్ లో సేవలందించేందుకు ప్రత్యేకంగా వైద్యులను నియమించామని, ఇందులో జనరల్ ఫిజిషియన్, నర్సు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు, వార్డులోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందని, వీరి కోసం ప్రత్యేకంగా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నందు నిర్వహించిన ప్రజాపాలన విజయ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. వైద్య వృత్తి దేవుడితో సమానం అని, మీరు భవిష్యత్తులో మంచి డాక్టర్ లుగా ప్రజలకు గొప్ప సేవలు అందించాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. కళావతి బాయి, జిల్లా సంక్షేమ అధికారి కె. రామ్ గోపాల్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, వైద్యాధికారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News