విద్యార్థినీల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

మూకమామిడి (గుట్టగూడెం) ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ (ఎస్జీటీ) విద్యార్థినీలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినీలు తల్లిదండ్రులకు ఫిర్యాదుచేశారు.

Update: 2024-09-17 08:56 GMT

దిశ, ములకలపల్లి : మూకమామిడి (గుట్టగూడెం) ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ (ఎస్జీటీ) విద్యార్థినీలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినీలు తల్లిదండ్రులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు మంగళవారం వారి తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయుడిని నిలదీశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి, అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. మండల విద్యాశాఖ అధికారి శ్రీరామమూర్తి ఘటన జరిగిన మూకమామిడి పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. 

Tags:    

Similar News