ఉపాధ్యాయుల కావాలని విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల ఆందోళన
తమ పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు సరిపోవడం లేదని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.
దిశ, కొత్తగూడెం: తమ పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు సరిపోవడం లేదని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పాత కొత్తగూడెం, హనుమాన్ బస్తి ప్రాథమిక పాఠశాలలో 189 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కానీ వీరికి సరిపోయేంత మంది టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు సరైన విద్య అందక చదువుకు దూరం అవుతున్నారు. 189 మంది విద్యార్థులకు కేవలం ముగ్గురు టీచర్లే ఉండడం, అందులో ఒక టీచర్ లీవ్ పై వెళ్లడంతో గత 15 రోజులుగా ఇద్దరు ఉపాధ్యాయులతో పాఠశాల నిర్వహిస్తున్నారు.
దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. నలుగురు ఉపాధ్యాయులని డిప్యూటేషన్ మీద పంపడంతో కొరత ఏర్పడిందని మిగతా ఉపాధ్యాయులు అంటున్నారు.తమకు ఉపాధ్యాయులు కావాలని విద్యార్థులు తరగతులు బహిష్కరించి స్కూల్ బయటికి వచ్చి కింద కూర్చొని ఆందోళన చేశారు. మధ్యాహ్నం భోజనం కూడా సరిపడా పెట్టడం లేదని, నాణ్యమైన కూరలు, అన్నం వడ్డించట్లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.