hospital : సత్తుపల్లి వంద పడకల ఆసుపత్రి సర్వం సిద్దం.. ప్రారంభోత్సవమే తరువాయి..
సత్తుపల్లి వంద పడకల ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధమైంది.
సత్తుపల్లి వంద పడకల ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధమైంది. గత 46 ఏండ్లుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ వస్తున్న ఈ ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వంద పడకల ఆస్పత్రి మంజూరు చేయగా రూ.34 కోట్ల వ్యయంలో పున: నిర్మాణ పనులు చేపట్టారు. ఆస్పత్రిని 1,28356 చదరపు అడుగుల విస్తీర్ణంలో.. మూడు అంతస్తుల్లో నిర్మాణం చేపట్టారు. ఇందులో ఐదు ఆపరేషన్ థియేటర్‌లు, 19వార్డుల విభాగాలు, 5 ఐసీసీయూ బెడ్స్, 98 నార్మల్ బెడ్స్‌తో పాటు కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 100 మందికి ఒకేసారి ఆక్సిజన్ అందించేలా ఏర్పాటు చేశారు. ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేలా అత్యాధునిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా ఆస్పత్రిని తీర్చిదిద్దారు. మిగిలిపోయిన పనులను వేగంగా పూర్తి చేస్తూ.. ప్రారంభానికి ముస్తాబు అవుతున్నది.
దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి వంద పడకల ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధమైంది. సత్తుపల్లి పరిసర ప్రాంత ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేలా అత్యంత ఆధునిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా ఆస్పత్రిని తీర్చిదిద్దారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వాస్పత్రి 1976 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించగా.. 1978 సంవత్సరంలో 50 పడకల ఆస్పత్రిగా మార్చి.. అప్పటి నుంచి గత 46 ఏండ్లుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నది. ఆస్పత్రి పూర్తిగా శిథిలావస్థకు చేరుకోగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తి మేరకు మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో టీవీవీపీ నిధులతో 34.కోట్ల వ్యయంతో అప్పటి మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా 29. 01.2022న భూమి పూజ నిర్వహించి, శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రిని 1,28356 చదరపు అడుగుల విస్తీర్ణంలో.. మూడు అంతస్తుల్లో నిర్మాణం చేపట్టారు. ఐదు ఆపరేషన్ థియేటర్‌లు, 19వార్డుల విభాగాలు, 5 ఐసీసీయూ బెడ్స్, 98 నార్మల్ బెడ్స్‌తో పాటు కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 100 మందికి ఒకేసారి ఆక్సిజన్ అందించేందుకు అత్యాధునిక టెక్నాలజీ, సదుపాయాలతో ఏర్పాటు చేశారు.
గ్రౌండ్ ఫ్లోర్‌లో..
రేడియాలజీ ఫిజియోథెరపీ విభాగం, ఐసీటీసీ, పీపీటీసీటీ, లాండ్రీ, ప్యాంట్రి, హాస్పిటల్ సోట్రిస్, పీడియాట్రిక్స్, ఓపీడీ, ఆరోగ్య శ్రీ, ఆరోగ్య మిత్ర విభాగం, ఓబీజీఓపీడీ, లైబ్రరీ బ్లాక్, క్యాజువాలిటీ బ్లాక్, డయాలసిస్ సెంటర్ ఉన్నాయి.
ఫస్ట్ ఫ్లోర్‌లో..
పేథాలజీ విభాగం సెంట్రల్ ల్యాబ్, బ్లడ్ బ్యాంక్, అడ్మినిస్ట్రేషన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ అండ్ టీవీ /సీడీ, స్కిన్ అండ్ సైక్రియా టీఓపీడీ, ఐఎంట్ & డెంటల్ ఓపీడీ, సీఎస్ఎస్‌డీ, ఓ,టీ కాంప్లెక్స్, ఐసీసీయూ వార్డు ఐదు బెడ్స్ ఏర్పాటు చేశారు.
సెకండ్ ఫ్లోర్‌లో..
98 బెడ్లతో వార్డు, పే రూమ్స్ 15 బెడ్స్ కేటాయించారు.