Godavari River : పెరుగుతున్న గోదావరి ప్రవాహం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణా
దిశ, భద్రాచలం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తునాయి. దీంతో పెద్ద ఎత్తున వరద నీరు గోదావరికి వచ్చి చేరడంతో భద్రాచలం వద్ద గోదావరి క్రమేపీ పెరుగుతూ వస్తుంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 18.2 అడుగుల మేర నిలకడగా ఉన్న గోదావరి, శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు 26.30 అడుగులకు పెరిగి ప్రవహిస్తుంది. గోదావరి ఉపనదులు ఇంద్రావతి, ప్రాణహిత నదులు కూడా ఉప్పొంగడం, కాళేశ్వరం నుంచి కూడా భారీగా వరద నీరు వస్తుండటంతో శుక్రవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరి 29 అడుగులకు పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.