రమేష్ బిదూరి బహిరంగ క్షమాపణలు చెప్పాలి..: సత్తుపల్లి ఎమ్మెల్యే

మండలంలో పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్

Update: 2025-01-07 12:48 GMT

దిశ,తల్లాడ: మండలంలో పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ 27 గ్రామపంచాయతీలో పర్యటించి ఇంటింటికి వెళ్లి 95 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులురూ. 35 లక్షల విలువ గల చెక్కులను అందజేశారు.అనంతరం తల్లాడ మండలంలోని గ్రామపంచాయతీ లో విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కజి సింగ్మెట్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక చంపల్లాగా చేస్తానని వ్యాఖ్యానించారు.

బీజేపీ పార్టీ ఆడపిల్లలకు అండగా ఉంటుందని చెప్తూనే సాటి మహిళపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడం పట్ల సాటి మహిళలకు ఎలాంటి విలువనిస్తుందో తెలుస్తూనే ఉంది కాబట్టి ఏ సభలో అయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీని అభ్యంతకర వ్యాఖ్యలు చేశారో అక్కడే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ తల్లాడ మండల అధ్యక్షులు కాపా సుధాకర్, మాజీ ఎంపిటిసి దగ్గుల రఘుపతి రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాయల రాము,మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దివ్వెల కృష్ణయ్య,జిల్లా నాయకులు హెచ్డి కృష్ణారెడ్డి,కటికి కిరణ్,తుమ్మలపల్లి రమేష్, సామినేని రామప్ప రావు, జక్కంపూడి కిషోర్,తదితర కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News