శాసన సభ్యునిగా ఒక్క అవకాశం ఇవ్వండి

మధిర శాసనసభ్యునిగా తనకు ఒక్క అవకాశం ఇవ్వండి, మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రానికి మధిరను తల మానికంగా నిలుపుతానని మధిర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్ రాజు పేర్కొన్నారు.

Update: 2023-10-25 11:14 GMT

దిశ, మధిర : మధిర శాసనసభ్యునిగా తనకు ఒక్క అవకాశం ఇవ్వండి, మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రానికి మధిరను తల మానికంగా నిలుపుతానని మధిర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని రామాచంద్రపురం గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో తనకు మీరు ఇచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం తో మధిర ను అభివృద్ధి పథంలో కి తీసుకొచ్చానని , ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఇంతకముందు ఉన్న శాసనసభ్యులు బోడేపూడి వెంకటేశ్వరరావు, శీలం సిద్ధారెడ్డి, కట్టా వెంకట నరసయ్య, కొండబాల కోటేశ్వరరావు హయాంలో మధిర అభివృద్ధి చెందిందని, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భట్టి మధిర ను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారని అన్నారు.

     ఎవరిని ఎన్నుకుంటే మధిర అభివృద్ధి చెందుతుందో వారిని ఎన్నుకోవాలి అన్నారు. దొర లను శాసన సభ్యులుగా ఎన్నుకుంటే సామాన్యులను పట్టించుకోరని, వారి సంపాదనకే సమయం కేటాయిస్తారని, ప్రజలకు అందుబాటులో ఉండరని తెలిపారు. తనను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పేదల బాగోగులను అర్థం చేసుకొని వారికి తోడుగా నిలుస్తానన్నారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను కేసీఆర్ తప్పకుండా అమలు చేస్తానన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో

    విత్తనాభివృద్ధి చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, గుర్రం రామారావు, కటికల సత్యనారాయణ రెడ్డి, కోటేశ్వరరావు, చిత్తారు నాగేశ్వరావు, రావూరి శ్రీనివాసరావు, శీలం వెంకటరెడ్డి, బిక్కి ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రచార రథానికి పూజా కార్యక్రమం జరిపించారు. ఈ కార్యక్రమంలో లింగాల కమల్ రాజు దంపతులు, కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామంలో ప్రచార కార్యక్రమంలో భాగంగా లింగాల కమల్ రాజు విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Tags:    

Similar News