రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రజా పాలన కొనసాగుతోంది : ఎమ్మెల్యే పాయం

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రజాపాలన

Update: 2024-09-30 12:53 GMT

దిశ, కరకగూడెం : కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రజాపాలన కొనసాగుతోందని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం కరకగూడెం మండలంలోరూ. 2 కోట్ల 50 లక్షల రూపాయల అంచనాతో శ్రీరంగాపురం, తాటిగూడెం, కరకగూడెం, చిరుమల్ల, రాయణపేట గ్రామాలల్లో పలు సీసీ రోడ్లకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అలాగే వట్టం వారి గుంపు, చిరుమల్ల నూతన గ్రామపంచాయతీలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామాల్లో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అధికారులతో ప్రజల సమక్షంలోనే మాట్లాడి ఆయా పంచాయతీ పరిధిలో గల గ్రామలలో ప్రభుత్వం ప్రారంభించిన గ్యారెంటీ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా ఏదైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు తెలియజేసారు.

అలాగే పంచాయతీలలో నీటి సరఫరా, కరెంటు సమస్యలు, ఇరిగేషన్ ఇలా అన్ని సమస్యలను అధికారుల దృష్టిలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకం, కొత్త రేషన్ కార్డు ఇప్పించే కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కానుందని అందరూ దరఖాస్తులు చేసుకోవాలని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇప్పించే బాధ్యత తనదని చెప్పారు. అలాగే ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా అధికారులతో పనులు చేపిస్తూ ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే చిరుమల్ల నూతన గ్రామ పంచాయతీ భవనానికి స్థలా ధాత మాజీ సర్పంచ్ స్వర్గీయ చందా నరసింహారావు స్థలం కేటాయించారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Similar News