ఖైదీలు సత్ప్ర​వర్తనతో మెలగాలి

క్షణికావేశంలో చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్ర​వర్తనతో మెలగాలని జిల్లా ప్రిన్సిపల్​ జడ్జి జి. రాజగోపాల్​ అన్నారు.

Update: 2024-10-02 11:49 GMT

దిశ, ఖమ్మం రూరల్ ​: క్షణికావేశంలో చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్ర​వర్తనతో మెలగాలని జిల్లా ప్రిన్సిపల్​ జడ్జి జి. రాజగోపాల్​ అన్నారు. బుధవారం రూరల్​ మండలం దానవాయిగూడెం పరిధిలో గల జిల్లా జైలులో గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైలులోపల ఖైదీలందరూ తమ ప్రవర్తనలో మార్పుతో త్వరగా విడుదల కావాలని ఆకాంక్షించారు. ఇంటిని మరిపిస్తున్న జైలులో ఖైదీలకు ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ ఇచ్చి వస్తువులు తయారు చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ ఏ. శ్రీధర్​ మాట్లాడుతూ మహాత్మాగాంధీ గొప్పతనం, జైలులో చేపట్టిన అనేక ప్రగతి కార్యక్రమాలను వివరించారు.

     ముద్దాయిలకు జైళ్ల శాఖ మెప్మా ద్వారా వృత్తి విద్యలు నేర్పించడం, పెట్రోలు బంకులలో ఉద్యోగాలు కల్పించడం, వారి కుటుంబాలకు లోన్స్ ఇవ్వడం ద్వారా సహాయం అందిస్తుందని తెలిపారు. జిల్లా సబ్​ జైలు అధికారి జి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విచారణ ఖైదీలు వారికి గల ఉచిత న్యాయ సహాయం ఉపయోగించుకొని బెయిల్ పొందాలని తెలిపారు. అనంతరం ఆటల పోటీలలో గెలుపొందిన ఖైదీలకు బహుమతులను రాజగోపాల్ అందించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కేవీ చంద్రశేఖర్ రావు, జిల్లా సబ్​ జైలు అధికారి జి. వెంకటేశ్వర్లు, జైలర్లు సక్రునాయక్​, లక్ష్మీనారాయణ, సుభాష్​, హనుమంతరావు పాల్గొన్నారు. 

Tags:    

Similar News