గిరిజనుల భవిష్యత్​కు బంగారుబాట ఏకలవ్య స్కూల్

గిరిజన పిల్లల భవిష్యత్​కు బంగారుబాట ఏకలవ్య మోడల్ స్కూల్ అని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు.

Update: 2024-10-02 13:19 GMT

దిశ, టేకులపల్లి : గిరిజన పిల్లల భవిష్యత్​కు బంగారుబాట ఏకలవ్య మోడల్ స్కూల్ అని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. బుధవారం టేకులపల్లి మండలం బద్దుతండా గ్రామపంచాయతీ పరిధి నంద్యాతండా గ్రామ సమీపంలో నిర్మించిన ఏకలవ్య మోడల్ కో ఎడ్యుకేషన్ పాఠశాలను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జార్ఖండ్​లో నిర్వహించిన ఏకలవ్య స్కూలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా వర్చువల్ పద్ధతిలో స్విచ్ ఆన్ చేసి ఇక్కడి స్కూల్​ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ఆదివాసీ పిల్లల కోసం దేశ వ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేసి సీబీఎస్ఈ సిలబస్ ను ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు.

    ప్రతి ఒక్కరూ మంచి చదువులు చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసు నుంచి ఇంగ్లిష్ మీడియంలో విద్యను అభ్యసించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ సీఓఐ టీడీఏ నాగార్జున రావు, ఓఎస్డీ హైదరాబాద్ కృష్ణారావు, ఏఈ సీపీడబ్ల్యూడీ చందర్రావు, బీఎస్ఎన్ఎల్ ఆఫీసర్ సక్కు, టేకులపల్లి ఎస్ఐ పోగుల సురేష్, టేకులపల్లి సీఐ తాటిపాముల సురేష్, డీఎస్పీ చంద్రబాను , మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్, నేషనల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ప్రిన్సిపాల్ నిశాంత్ , విద్యార్థులు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News