మండలంలో ఇష్టారీతిగా కరెంట్‌కట్.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
రూరల్మండలంలో ఎడాపెడా చేస్తున్న కరెంట్‌కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమి, ఉక్కపోతతో నానా అవస్థలు పడుతున్నారు.
దిశ, ఖమ్మం రూరల్: రూరల్మండలంలో ఎడాపెడా చేస్తున్న కరెంట్‌కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమి, ఉక్కపోతతో నానా అవస్థలు పడుతున్నారు. ఓవైపు ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని సంబురాలు నిర్వహిస్తుంటే రూరల్మండలంలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతున్నది. ఇదేంటని విద్యుత్అధికారులను అడిగితే ఓవర్‌లోడ్‌తో ఇలా జరుగుతున్నదని సమాధానం చెబుతున్నారు. సహజంగా ఎండాకాలంలో కరెంటు వినియోగం అధికంగానే ఉంటుందని తెలిసినా ముందస్తు ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలం అయ్యారనే విమర్శలు వస్తున్నాయి. తీరా సీజన్వచ్చాక ఓవర్ లోడ్పేరుతో ఇష్టారితీన కటింగ్‌లు చేస్తుండటంతో ఆశాఖ అధికారులపై అసహనం వ్యక్తం అవుతున్నది. మరోవైపు ఎండాకాలం ముగుస్తున్నా అధికారులు సమస్యను అధిగమించకపోవడం గమనార్హం.
ముందస్తు ప్రణాళికేది..?
సీజనల్‌లో అధిక కరెంట్ వినియోగానికి చెక్‌పెట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటే ప్రజలకు కరెంట్ కోతలతో ఇబ్బందులు ఉండవు. సబ్‌స్టేషన్ వారీగా గ్రామాల్లో ఓవర్లోడ్ జాబితాను రూపొందించుకొని నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవడంతో సమస్యకు చెక్‌పెట్టే అవకాశం ఉంది. కేవలం కరెంట్ అధికారుల నిర్లక్షంతోనే కరెంట్ కోతలు వస్తున్నాయి. మండలంలోని ప్రధానంగా ఏదులాపురం పరిధిలోని శ్రీరామ్‌నగర్, గుర్రలపాడు, పెద్ద తండా, మద్దులపల్లి తదితర ప్రాంతాలతో పాటు, ఆరెంపుల సబ్‌స్టేషన్ పరిధిలోని ఆరెంపుల, బారుగూడెం, ఆరెకోడు, చింతపల్లి తదితర గ్రామాల్లో కరెంట్ కటింగ్ వీపరితంగా ఉంది. సమయపాలన లేకుండా కరెంట్ కటింగ్ చేస్తుంటడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఓవర్లోడ్ ప్రాంతాలను గుర్తించి అక్కడ అధికలోడ్ గల ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తే ప్రజలు ఉక్కపోతల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది.
ఇబ్బంది పడుతున్నాం.
శ్రీరామ్‌నగర్‌లో రోజు కరెంట్ కటింగ్చేస్తుండటంతో ఉక్కపోతల మధ్య జీవనం సాగిస్తున్నాం. అధికారులను ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెబుతున్నారు. ఉక్కపోతల నుంచి ఉపశమనం కలిగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.- హరి, శ్రీరామ్‌నగర్ కాలనీ
కరెంట్ కోతలు నిజమే..
కరెంట్‌కోతలు ఉన్నమాట వాస్తవమే. ఫీజులు కొట్టేస్తుండటంతో ఎల్‌సీ తీసుకోవడంతో కరెంట్ సరఫరా కట్ చేస్తున్నాం. కరెంట్వినియోగం అధికంగా ఉండటంతో సమస్య తలెత్తుతుంది. ఓవర్ లోడ్ఉన్న ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులకు ప్రపోజల్ పంపించాం.-క్రాంతి సింహా, ఏఈ, ఏదులాపురం