MLA :రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతును రాజును చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ (MLA Dr. Matta Ragamai Dayanand)అన్నారు.

Update: 2024-10-29 09:37 GMT

దిశ,సత్తుపల్లి :  MLA : తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతును రాజును చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ (MLA Dr. Matta Ragamai Dayanand)అన్నారు. సత్తుపల్లి మండలంలో మంగళవారం తుంబురు, గంగారం, కాకర్లపల్లి తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అర్హత గల ప్రతి రైతుకు రుణమాఫీ, రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా అమలు చేసి తీరుతుందని అన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని తెలిపారు. చిన్నచిన్న సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీలో జాప్యం జరుగుతుందని, త్వరలో రైతు భరోసా కూడా అందిస్తామని, అర్హత గల ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని పేర్కొన్నారు.

    విడతల వారీగా నియోజకవర్గానికి 4 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్నవడ్లు పండించిన ప్రతి రైతుకు కింటాకు రూ.500 బోనస్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఆమె అన్నారు. గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. గ్రామాల్లో రైతులు పంటలు అమ్మేటప్పుడు దళారుల(Brokers)ను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. పలు సొసైటీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి తహసీల్దార్ యోగేశ్వరరావు, ఎంపీడీఓ ఆర్.చిన్న నాగేశ్వరరావు, ఏపీఎం బాబురావు, సొసైటీ అధ్యక్షులు చెలుకూరి కృష్ణమూర్తి, గంగారం ఎంపీటీసీ మందపాటి చిట్టి నాయన, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక రైతులు, తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News