రైతుల విశ్రాంతి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
మండలంలోని అప్పారావుపేట పామాయిల్ కర్మాగారంలో నూతనంగా నిర్మించిన డీ మక్ పౌడర్ ప్లాంట్ ను, కర్మాగారానికి పామాయిల్ గెలలు తీసుకొచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా విశ్రాంతి భవనాన్ని ఆదివారం అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు , రాష్ట్ర ఆయిల్ ఫెట్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి కలిసి ప్రారంభించారు.
దిశ, దమ్మపేట : మండలంలోని అప్పారావుపేట పామాయిల్ కర్మాగారంలో నూతనంగా నిర్మించిన డీ మక్ పౌడర్ ప్లాంట్ ను, కర్మాగారానికి పామాయిల్ గెలలు తీసుకొచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా విశ్రాంతి భవనాన్ని ఆదివారం అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు , రాష్ట్ర ఆయిల్ ఫెట్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పామాయిల్ కర్మాగారానికి వచ్చిన రైతులతో ఎమ్మెల్యే కొంతసేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పామాయిల్ సంఘం అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు రావు జోగేశ్వరరావు, జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, మేనేజర్లు కళ్యాణ్, ముష్టిబండ సర్పంచి బత్తిని తిరుపతిరావు, మల్కారం సర్పంచ్ రూప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన
దమ్మపేట శివాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ను దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు.