ఈ నెలాఖరు లోపు ప్రతి నియోజకవర్గంలో నాలుగు వేల ఇందిరమ్మ ఇళ్లు... మంత్రి పొంగులేటి

ప్రతిపక్ష పార్టీలు వారి ఉనికిని కాపాడుకోడానికి విమర్శలు చేస్తున్నాయని రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Update: 2024-10-16 07:58 GMT

దిశ, నేలకొండపల్లి : ప్రతిపక్ష పార్టీలు వారి ఉనికిని కాపాడుకోడానికి విమర్శలు చేస్తున్నాయని రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం నేలకొండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. అనంతరం గౌడన్నలకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ చేశారు. పీఎస్ఆర్ ట్రస్ట్ చే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఆనాడు మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిందన్నారు. గత పది సంవత్సరాలు పాలించిన పార్టీ కాకి గోల పెట్టినా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సాహం ఇస్తుందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు ఇందిరమ్మ రాజ్యం ఇస్తుందన్నారు. ఆర్ధికంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందని ఆడబిడ్డకు ఇచ్చిన మాట ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు.

రెండు లక్షల రుణమాఫీ రూ.18 వేల కోట్లు చేశాం అన్నారు. ఇంకా 13 వేల కోట్ల రూపాయలు చేయాల్సి ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీలు వారి ఉనికిని కాపాడుకోడానికి విమర్శలు చేస్తున్నారని, భవిష్యత్ లో కూడా మీ దీవెనలు ఉండాలన్నారు. ఈ నెలాఖరులోపు ప్రతి నియోజకవర్గంలో నాలుగు వేల ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని వెల్లడించారు. పీఎస్సార్ ట్రస్టు నుంచి ప్రభుత్వ స్కూల్ లో చదివే విద్యార్థినిలకు సైకిళ్ళు ఇస్తున్నామన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిజం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెన్నపూసల సీతారాములు, వల్లాల రాధాకృష్ణ నెల్లూరు భద్రయ్య, నరేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News