పచ్చదనంతో మధిరను సుందరీకరణగా తీర్చిదిద్దాలి : డిప్యూటీ సీఎం భట్టి
నేను నా మధిర క్లీన్ అండ్ గ్రీన్ అనే కాన్సెప్ట్ తో వినూత్న రీతిలో
దిశ,మధిర : నేను నా మధిర క్లీన్ అండ్ గ్రీన్ అనే కాన్సెప్ట్ తో వినూత్న రీతిలో మధిర ను సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి. ఆ దిశగా అధికారులు ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం ఆర్థిక ప్రణాళిక ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మధిర క్యాంపు కార్యాలయంలో మధిర మున్సిపల్ అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ మధిర పట్టణాన్ని పచ్చని చెట్ల నడుమ , పరిశుభ్రమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో చూడాలని , పచ్చని చెట్ల నడుమ ప్రజలు ఆనందంగా జీవించాలని ఆ దిశగా అధికారులు అడుగులు వేయాలన్నారు. ఈ నెల 14 నుండి నేను నా మధిర క్లీన్ అండ్ గ్రీన్ అనే కాన్సెప్ట్ తో మధిర పట్టణాన్ని సుందరీ కారణంగా తీర్చిదిద్దేందుకు జరిగే కార్యక్రమంలో అధికారులు ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అది ప్రతి ఒక్కరి బాధ్యత , తమకు చెందిన ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు తొలగించడం మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ఖాళీ స్థలంలో కంప చెట్లు పెంచ వద్దని వాటికి బదులుగా ఆ స్థలాల్లో మొక్కలు నాటి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రైవేట్ ఖాళీ స్థలాలను శుభ్రం చేసే బాధ్యత యజమానులదే అని వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తేనే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని దాంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు. అదేవిధంగా మధిర పట్టణంలోకి ప్రవేశించే ప్రజలకు పచ్చని గ్రీనరీతో ఆహ్వానం పలికే విధంగా ప్రధాన రహదారుల వెంబడి మధిర పట్టణంలో ప్రతి చోట పచ్చదనం ఉట్టిపడేలా పార్కులు ఏర్పాటు చేయాలని సాయంత్రం సమయాల్లో ఆ పార్కుల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు పెద్దలు సేద తీరుతారన్నారు.
మధిర రైల్వే బ్రిడ్జి నుంచి శివాలయం మీదుగా రాయపట్నం బ్రిడ్జి వరకు వైరా నదికి ఇరువైపులా రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మధిర పట్టణాన్ని క్లీన్ గ్రీన్ గా ఉంచడానికి అవసరమైన స్లీపింగ్ మిషన్ కొనుగోలు చేయాలని , తడి పొడి చెత్త సేకరణకు ఇంటింటికి చెత్త డబ్బాలను పంపిణీ చేయాలని , పాత డంపింగ్ యార్డ్ కి వెళ్లే ఇంటర్నల్ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ తో పాటు మండల కేంద్రాల్లో పిచ్చి మొక్కలు తొలగించేందుకు ట్రీ కట్టర్ గ్రాస్ కట్టర్స్ కొనుగోలు చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. మధిర మున్సిపాలిటీలోని చెత్త సేకరించి వాహనాల మూమెంట్ తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన జిపిఆర్ఎస్ ట్రాకింగ్ ను కలెక్టర్ మొబైల్ కు కనెక్ట్ చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మధిర మున్సిపాలిటీ కార్యాలయ నూతన భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యత ప్రమాణాలతో కనీసం వంద సంవత్సరాలు ఉండే విధంగా భవన నిర్మాణం ఉండాలన్నారు.
మధిర పట్టణంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచడం తో పాటు అక్కడ పచ్చదనం కూడా ఉండే విధంగా ఏర్పాటు చేయాలి అన్నారు. మధిర పట్టణంలో వరద ముంపు ప్రాంతాల్లో సాచి రేషన్ పద్ధతిలో సిసి రోడ్లు పునరుద్దించాలని పేర్కొన్నారు. మధిర మున్సిపల్ పరిధిలో రోడ్ హద్దులు దాటి నిర్మాణాల జరిగితే వాటిని తొలగించే బాధ్యత మున్సిపల్ కమిషనర్ దే , రాజకీయాలకు అతీతంగా మధిర మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు , సుందరీకరణ గా తీర్చిదిద్దే విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని , అక్రమ కట్టడాలు కట్టిన , కట్టడానికి ప్రయత్నించిన వాటిని తొలగించేందుకు ఫుల్ పవర్స్ ను కమిషనర్ కు ఉన్నాయని , అటువంటి అక్రమ కట్టడాలను తొలగించకపోతే కమిషనర్ ను విధులను తొలగిస్తామని తెలిపారు. మున్సిపల్ పరిధిలోనే అన్ని కాలనీల్లో వీధి దీపాలు వెలిగే విధంగా చూడాలని , నిత్యం పర్యవేక్షణ చేయాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలోని మడపల్లి గ్రామ సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో నూతన డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.