అభివృద్ధికి కేరాఫ్ గా మధిర
మధిర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మధిర ను అభివృద్ధి చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
దిశ, మధిర : మధిర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మధిర ను అభివృద్ధి చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం మధిర మున్సిపాలిటీలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద 19 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయనున్న సైడ్ కాలువలు, ఫుట్ పాత్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధిర పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయి అని తెలిపారు. భవిష్యత్తులో ఇతర ప్రాంతాల ప్రజలు మధిరలో స్థిర పడేందుకు ఇష్ట పడేలా మౌలిక వసతులు మెరుగు పరచడం జరుగుతుందన్నారు. నాలుగు సార్లు గెలిపించిన ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానని, మధిర అంటే అభివృద్ధికి కేరఫ్ అడ్రస్ గా నిలుపుతానన్నారు. మధిర పట్టణ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మధిర తహసీల్దార్ రాళ్లబండి రాంబాబు, ఎంపీడీఓ బి.వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ చైర్ పర్సన్ మొండితోక లత, కమిషనర్ సంపత్ కుమార్, ఆర్అండ్ఈ ఈజీ శంకర్ రావు, ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్ దొండపటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ పుతంబాక కృష్ణ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల వెంకట రమణ గుప్తా, సూరంశెట్టి కిషోర్, మల్లాది వాసు యరమల పూర్ణ చంద్రారెడ్డి, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ , నెహ్రూ, బొమ్మకంటి హరిబాబు, యన్నం కోటేశ్వరరావు, పాటిబండ్ల సత్యంబాబు, తలుపుల వెంకటేశ్వర్లు, ధార బాలరాజు, యర్రగుంట లక్ష్మీ, మోండితోక నాగ రాణి తదితరులు పాల్గొన్నారు.