సంత మార్కెట్లో అగ్ని ప్రమాదం

మున్సిపాలిటీ పరిధిలోని సంత మార్కెట్లో ఉన్న రోజువారి కూరగాయల మార్కెట్లోని హాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2024-12-15 13:53 GMT

దిశ, కొత్తగూడెం : మున్సిపాలిటీ పరిధిలోని సంత మార్కెట్లో ఉన్న రోజువారి కూరగాయల మార్కెట్లోని హాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందు కున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని గంట పాటు శ్రమించి మంటలను ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్నిప్రమాదం ఏర్పడిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. సుమారు మూడు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. రెండు కంప్యూటర్లు, ఇన్వర్టర్, ఒక ఏసీతో పాటు, బీరువాలు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. 


Similar News