గిరిజన మహిళా రైతులపై చేయి చేసుకున్న ఫారెస్ట్ అధికారులు..! పరిస్థితి ఉద్రిక్తం (వీడియో)
సత్తుపల్లి పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని గుడిపాడు శివారులో కాకర్లపల్లి రెవెన్యూ పరిధిలో గత 20 సంవత్సరాలుగా పోడు భూములను కొందరు....Land dispute between tribal farmers and forest officials
దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని గుడిపాడు శివారులో కాకర్లపల్లి రెవెన్యూ పరిధిలో గత 20 సంవత్సరాలుగా పోడు భూములను కొందరు రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గిరిజన రైతులు పోడు భూముల్లో మొక్కలు నాటే ప్రయత్నం చేస్తున్నారని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందటంతో గిరిజన రైతులను ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారులు అతి ఉత్సాహంతో గిరిజన మహిళలపై చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో గిరిజన మహిళలు ఫారెస్ట్ అధికారులతో అంతే రీతిలో ప్రతిఘటించారు. వీరు ఇరువురి మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకున్నది. ఈ సందర్భంగా గిరిజన రైతులు ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గుడిపాడు గిరిజన మహిళ రైతులను మట్టి కరిపిచ్చేస్తానని ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ వ్యాఖ్యానించారని గిరిజన మహిళా రైతులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం ఐదు గంటల వరకు వేచి చూసిన ఫారెస్ట్ అధికారులు చివరకు చేసేదేమీ లేక విని తిరిగి వెళ్లిపోయారు.