పర్యాటక కేంద్రంగా కనకగిరి గుట్టలు : కలెక్టర్ జితేష్ వి.పాటిల్
చండ్రుగొండ మండలం బెండల పాడు
దిశ, అశ్వారావుపేట/చండ్రుగొండ: చండ్రుగొండ మండలం బెండల పాడు గ్రామపంచాయతీలో మంగళవారం భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ పర్యటించారు. కనకగిరి గుట్టలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా జరుగుతున్న ఏర్పాటులను ఆయన పరిశీలించారు. ఈనెల 11వ తేదీన హైదరాబాద్ నుంచి కనకగిరి గుట్టల సందర్శనార్థం కొందరు ముఖ్య అతిథులు రానున్నారు. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు.