విద్యుత్ తీగలు తగిలి వరిగడ్డి దగ్ధం..

ట్రాక్టర్‌లో తీసుకువస్తున్న వరిగడ్డి వాముకు విద్యుత్ తీగలు తగిలి వరిగడ్డి దగ్ధమైంది.

Update: 2023-04-17 11:05 GMT

దిశ, కూసుమంచి : ట్రాక్టర్‌లో తీసుకువస్తున్న వరిగడ్డి వాముకు విద్యుత్ తీగలు తగిలి వరిగడ్డి దగ్ధమైంది. ఈ ఘటన మండలంలోని లాల్ సింగ్ తండాలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లాల్ సింగ్ తండాకు చెందిన గుగులోత్ సోమ్లా అనే వ్యక్తి పశువుల మేతకోసం అదే గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద వరిగడ్డి కొనుగోలు చేశాడు.

ట్రాక్టర్లో వరిగడ్డి తీసుకు వస్తుండంగా కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు గడ్డికి తగిలి ఒక్కసారిగా మంటలు వ్యాపించి గడ్డి దగ్ధమైంది. దీంతో అప్రమత్తమైన ట్రాక్టర్ డ్రైవర్ వరి గడ్డిని ట్రాక్టర్ నుంచి కిందకు వదిలేశాడు. వరి గడ్డి పూర్తిగా దగ్దమవ్వడంతో రూ.10 వేలు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Tags:    

Similar News