విద్యార్థులకు ఉచితంగా టాబ్స్ పంపిణీ
ఖమ్మం రూరల్ మండలం కామంచికల్లు గ్రామంలోని జిల్లా ప్రభుత్వ పాఠశాల 9,10 తరగతి విద్యార్థులకు అలై ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉచితంగా టాబ్స్ పంపిణీ చేశారు.
దిశ,ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలం కామంచికల్లు గ్రామంలోని జిల్లా ప్రభుత్వ పాఠశాల 9,10 తరగతి విద్యార్థులకు అలై ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉచితంగా టాబ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ... సినీ గాయకురాలు స్మిత ఫౌండర్ గా ..పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ స్కూల్లో బాగా చదివే 9, 10 తరగతి విద్యార్థులను సెలెక్ట్ చేసి అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి , ఎస్ఎంసీ చైర్మన్ నరసింహారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.