జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ చైర్మన్ గా డాక్టర్ రవి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ చైర్మన్ గా ఇల్లందు నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు డా. గుగులోత్ రవిని టీపీసీసీ ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ నియమించారు.
దిశ,ఇల్లందు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ చైర్మన్ గా ఇల్లందు నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు డా. గుగులోత్ రవిని టీపీసీసీ ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ నియమించారు. డీసీసీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బృహత్తరమైన
బాధ్యతను అప్పజెప్పిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, టీపీసీసీ ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ లకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఎస్టీ సెల్ మండల కమిటీలు ఏర్పాటుచేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు.