కార్తీక స్నానాలకు పోటెత్తిన భక్తజనం..జనసంద్రంగా మారిన గోదావరి తీరం
శుక్రవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భద్రాచలం పుణ్యక్షేత్రం
దిశ, భద్రాచలం : శుక్రవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భద్రాచలం పుణ్యక్షేత్రం గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున మూడు గంటల నుండి గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను వెలిగించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి భద్రాచల పుణ్యక్షేత్రం చేరుకోవడంతో గోదావరి తీరం భక్తజనసందోహంతో కిటకిటలాడింది. గోదావరిలో పుణ్యస్నానాలు అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం తో పాటు సమీపంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.