అక్కడ అభ్యర్థి ఎవరు..? ప్రధాన పార్టీలలో కన్‌ప్యూజన్

సత్తుపల్లి రాష్ట్రంలోనే అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గంగా చెబుతుంటున్నారు

Update: 2023-09-27 02:54 GMT

దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి రాష్ట్రంలోనే అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గంగా చెబుతుంటున్నారు. కానీ ప్రస్తుతం ఇక్కడి రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుతం ఎమ్మెల్యే ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ప్రకటించగా.. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థి ఎవరనే విషయమై పెండింగ్ పెట్టాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరు, అధిష్టానం ఎవరిని ప్రకటిస్తుందోననే ఆసక్తి నెలకొంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు బరిలో నిలుస్తారనే చర్చ సాగుతున్నది. సత్తుపల్లిలో కాంగ్రెస్ నుంచి నలుగురు ఆశావాదులు పోటీలో ఉండగా.. ఆ సీటు ఏ అభ్యర్థికి దక్కనున్నదనే విషయమై ఉత్కంఠ నెలకొన్నది. డిసెంబర్‌లో ఎన్నికలు ఉంటాయనే ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్యే సండ్ర ప్రచారంలో దూసుకెళ్తుండగా.. ప్రధాన పార్టీలు అభ్యర్థుల ప్రకటన జాప్యం చేయడంతో ప్రచారంలో వెనకబాటు కనిపిస్తున్నది.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? ఆ సీటు ఎవరికి దక్కనున్నది అనే అంశంపై వారికున్న రాజకీయ అనుభవంతో పాటు పోటీ పడుతున్న ఆశావాదులకు ఉన్న ప్లస్ మైనస్లు ఈక్వేషన్ తో ఎవరికి తోచిన విధంగా వారు బేరీజు వేసుకుంటున్నారు. ఫలానా వ్యక్తి అయితే బాగుంటది ఈయనకంటే ఆయనా బెస్ట్ ఆయనా కంటే మరో ఆయనా బెస్ట్ అంటూ చర్చను మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు సుమారు రెండు 1.18 లక్షల ఓట్లు ఉండగా లక్ష వరకు ఓట్లు పురుషులు ఉన్నారు. యువ ఓటర్లు సుమారు 25వేల ఓట్లు పైచిలుకు ఉండటంతో.. మహిళా ఓటర్లతో పాటు యువ ఓటర్లుకు ప్రాముఖ్యత సంచరించుకుంది. మరో పార్టీ అయినా సత్తుపల్లి నియోజకవర్గంలో గత మూడు సార్లు గెలిచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సండ్ర వెంకట వీరయ్య టీడీపీ నుంచి గెలుపొందడంతో ఆ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరనే ఆసక్తి నెలకొంది.

సత్తుపల్లిలో వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐ అభ్యర్థులను నిలబెడతారా? లేదా మద్దతు ప్రకటిస్తారా? అనే అంశంపై కూడా చర్చ కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు రాజకీయ పార్టీలు నియోజకవర్గంలో అభ్యర్థులు ఎవరనేది ప్రకటించకపోవడంతో ఏ పార్టీ నుంచి ఎవరు వారు రాజకీయ అనుభవం ఏంటి? కులం గణనం ఏంటి? వారికి కలిసొచ్చే అంశాలు ఏంటి? ఎదుర్కొనే సమస్యలు ఏంటి? ప్రజాదరణ ఉందా? లేదా? మేజర్ నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకులు ఆశీస్సులు ఎవరికి ఉన్నాయనే అంశంపై విస్తృత స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి. డిసెంబర్లో ఎన్నికల ఉంటాయనే ఊహగానాలనే నేపథ్యంలో పలు పార్టీలకు చెందిన అభ్యర్థులును ప్రకటించకపోవడంతో ప్రచారంలో వెనుకబాడుతనం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులను బరిలో దించి బలబలాలు నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Tags:    

Similar News