పర్ణశాల దేవస్థానానికి చెన్నై హైకోర్టు జస్టిస్ వి. శివ జ్ఞానం..
చెన్నై హైకోర్టు జస్టిస్ వి.శివజ్ఞానం సోమవారం పర్ణశాల దేవస్థానాన్ని దర్శించుకున్నారు.

దిశ, దుమ్ముగూడెం : చెన్నై హైకోర్టు జస్టిస్ వి.శివజ్ఞానం సోమవారం పర్ణశాల దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం వద్దకు చేరుకున్న ఆయనను ఆలయ ఇంఛార్జి అనిల్ కుమార్, అర్చక స్వాములు కిరణ్ కుమారాచార్యులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతించారు. అనంతరం స్వామి వారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలను అందజేశారు. స్వామివారి కృపకు కృతజ్ఞతగా ఆయన ఆలయానికి భక్తిపూర్వక నైవేద్యం సమర్పించారు. తర్వాత ఆయన పర్ణశాల కుటీరం, నార చీరలు ప్రాంగణాన్ని సందర్శించి అక్కడి పవిత్రతను ఆస్వాదించారు. ఈ సందర్శనంలో దుమ్ముగూడెం ఎస్సై గణేష్, ఆలయ అర్చక బృందం, భక్తులు పాల్గొన్నారు.