సింగరేణి ప్రైవేటీకరణకు బీఆర్ఎస్, బీజేపీ కుట్ర

గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు పన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు ఆరోపించారు.

Update: 2024-06-20 15:04 GMT

దిశ, ఖమ్మం : గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు పన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు ఆరోపించారు. గురువారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వా మాట్లాడారు... సింగరేణి బొగ్గు గనులు తెలంగాణకు తలమానికంగా నిలిచే సంస్థను ప్రైవేటీకరణకు కేంద్రంలో ఉన్న బీజేపీ తెరవెనుక ఉండి మద్దతు తెలిపింది అన్నారు. 2015 సంవత్సరంలో కేంద్రంలో

    ఉన్న బీజేపీ ఎంఅండ్ఎం చట్ట సవరణ చేసి కేంద్రం బిల్లు పెట్టినప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న బొగ్గు గనులను వేలంపాటలో పాల్గొనకుండా తెలంగాణకు దక్కే విధంగా చర్యలు తీసుకోకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై బురద చల్లటం సరైనది కాదన్నారు. 29 అక్టోబర్ 2021న సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉన్నదో చెప్పాలన్నారు. 5 నవంబర్

    2021 కేసీఆర్ ఆదేశాలతో కేంద్రం వెనక్కి తగ్గి, సత్తుపల్లి -3, కొయ్యలగూడెం బొగ్గు గనులను కేసీఆర్ స్నేహితులకు అంటగట్టారన్నారు. సింగరేణి సంస్థ వేలం చేయకుండా తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి కూడా అడ్డుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బోగ్గు గనులను ఏర్పాటు చేసి తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్ట రాగమయి, వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్ పాల్గొన్నారు.


Similar News