ఖమ్మంలో వికసించిన బ్రహ్మ కమలం..

ఉత్తరఖాండ్​ రాష్ట్ర పుష్పమైన బ్రహ్మ కమలం పువ్వు ఇప్పుడు ఖమ్మం రూరల్​ మండలంలోని ఓ ఇంట్లో వికసించాయి.

Update: 2025-01-01 06:47 GMT

దిశ, ఖమ్మం రూరల్​ : ఉత్తరఖాండ్​ రాష్ట్ర పుష్పమైన బ్రహ్మ కమలం పువ్వు ఇప్పుడు ఖమ్మం రూరల్​ మండలంలోని ఓ ఇంట్లో వికసించాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 34 పుష్పాలు వికసించాయి. రూరల్​ మండలం ఏదులాపురం బైపాస్ లో గల రుత్విక్​ ప్యారడైజ్​ అపార్ట్​మెంట్​లో నివాసం ఉంటున్న రేపాల వెంకటేశ్వరావు, ఉమా దంపతులు తమ ఇంట్లో కుండిల్లో కొంత కాలం క్రితం బ్రహ్మకమలం చెట్టును నాటారు. న్యూ ఇయర్​ రోజున ఏకంగా 34 పువ్వులు వికసించడంతో అపార్ట్మెంట్ వాసులు చూసి తరిస్తున్నారు.

ఇంట్లో బ్రహ్మ కమలం ఇన్ని పువ్వులు పూయడం చాల సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. బ్రహ్మకమలం చూడాలంటే అదృష్టం ఉండాలని అందరి చెబుతుంటారు. భారతీయ సంస్కృతిలో దీనికి చాల ముఖ్యమైన స్థానం ఉంది. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ కమలం పై బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు. అలాగే దీనిని కింగ్​ హిమాలయన్​ ఫ్లవర్స్​ అని పిలుస్తారు. దీనిలో అనేక ఔషధ గుణాలు కూడా ఉంటాయి. పరమ శివుడికి బ్రహ్మకమలం చాలా ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి.


Similar News