18 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ..
మండల పరిధిలో ఉన్న 18 మంది లబ్ధిదారులకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
దిశ, మణుగూరు టౌన్ : మండల పరిధిలో ఉన్న 18 మంది లబ్ధిదారులకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. శనివారం మణుగూరు మండలంలోని ప్రజాభవన్ కార్యాలయంలో మణుగూరు తహశీల్దార్ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో 18 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రజా పాలనలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు.
గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పీరానాకి నవీన్, నాయకులు కూచిపూడి బాబు, గాండ్ల సురేష్, దొడ్డనేని మధు, తమ్మిశెట్టి సాంబ, బల్లెం సురేష్, పునేం శేఖర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు లీలావతి, గోపి, పంచాయతీ శాఖ అధికారులు టీఎస్ రావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.