ఘనంగా బోనాల జాతర

లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని ఇల్లందు గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న పోచమ్మ తల్లికి శ్రావణమాసం సందర్భంగా ఆదివారం మహిళలు బోనాలను సమర్పించారు.

Update: 2024-08-18 14:11 GMT

దిశ, కొత్తగూడెం రూరల్ : లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని ఇల్లందు గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న పోచమ్మ తల్లికి శ్రావణమాసం సందర్భంగా ఆదివారం మహిళలు బోనాలను సమర్పించారు. శ్రావణమాస బోనాల సందర్భంగా కొత్తగూడెం రైతు బజార్ నుండి కొత్తగూడెం ఫారెస్ట్ సెంట్రల్ పార్క్ వద్ద గల శ్రీ పోచమ్మ తల్లి ఆలయం వరకు అమ్మవారిని రథంపై

    ఊరేగిస్తూ శివసత్తులు కోలాట నృత్యాలు విచిత్ర వేషధారణల కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. పోచమ్మ తల్లి బోనాల జాతరను తిలకించేందుకు కొత్తగూడెం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News