మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాల కలకలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ

Update: 2024-11-07 11:08 GMT

దిశ,బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)భద్రాచలం డివిజన్ కమిటీ పేరిట కరపత్రాలు కలకలం రేపాయి. మండల పరిధిలోని పినపాకపట్టి నగర్ గ్రామంలో గురువారం మావోయిస్టులు కరపత్రాలు లభ్యమయ్యాయి.ఈ కరపత్రాల్లో గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, విద్యుత్ శాఖ ఉద్యోగి తోట మల్ల సురేష్ రాజకీయ నాయకుల అండదండలతో గిరిజన భూములను ఆక్రమించి వారిని బెదిరింపులకు గురి చేస్తున్నాడని లేఖలో పేర్కొన్నారు.

అలాగే గత ప్రభుత్వం హయాంలో దళిత బంధు పథకం పేరిట అమాయక దళితుల వద్ద కుటుంబానికి రూ.2 లక్షల వసూలు చేసినట్లు పేర్కొన్నారు. వెంటనే వారి డబ్బులు తిరిగి ఇచ్చేయాలని హెచ్చరించారు.ఇలాగే అమాయక గిరిజనుల వద్ద భూములకు పట్టా పాస్ పుస్తకాలు ఇప్పిస్తానని ఎకరానికి రూ.40 నుంచి 50 వేలు వసూలు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.రాజకీయ నాయకుల అండదండలతో అమాయక గిరిజనుల వద్ద వసూళ్లు చేసిన డబ్బులు వారికి తిరిగి ఇచ్చేయాలని హెచ్చరించారు. లేనిపక్షంలో ప్రజాకోర్టులో తీవ్రమైన శిక్ష తప్పదని హెచ్చరించారు.


Similar News