భద్రాద్రికి తరలి రానున్న 5 వేల గణనాథులు

గోదావరిలో వినాయక నిమజ్జనం జరపడానికి సుదూర ప్రాంతాలనుండి 5 వేల వినాయక విగ్రహాలు భద్రాద్రి తరలి రానున్నాయి.

Update: 2024-09-10 10:27 GMT

దిశ, భద్రాచలం : గోదావరిలో వినాయక నిమజ్జనం జరపడానికి సుదూర ప్రాంతాలనుండి 5 వేల వినాయక విగ్రహాలు భద్రాద్రి తరలి రానున్నాయి. నిమజ్జనం కొరకు భద్రాచలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా భద్రాచలంలో నిమజ్జన ఏర్పాట్లను OSD Paritosh Pankaj పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు.

    పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భక్తుల కొరకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. అదే విధంగా గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటం వలన ప్రజలు కరకట్టవైపు రాకూడదని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ట్రాఫిక్ ఎస్ఐ మధు ప్రసాద్, సిబ్బంది ఉన్నారు. 

Tags:    

Similar News