కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై మరో కీలక అప్‌డేట్

జాతీయ పార్టీ ఏర్పాటుపై టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. అక్టోబర్ 5వ తేదీన(దసరా రోజు) టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో జాతీయ పార్టీ ప్రకటనపై తీర్మాణం

Update: 2022-09-29 04:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ పార్టీ ఏర్పాటుపై టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. అక్టోబర్ 5వ తేదీన(దసరా రోజు) టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో జాతీయ పార్టీ ప్రకటనపై తీర్మాణం చేయనున్నారు. దసరా రోజు మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యవర్గం జాతీయ పార్టీపై తీర్మాణం చేయనుంది. ఇదే సమావేశంలో జాతీయ పార్టీ కోఆర్డినేటర్లను సీఎం కేసీఆర్ నియమించనున్నారు. అంతేగాక, 5వ తేదీన నిర్వహించబోయే సమావేశానికి జాతీయ నాయకులను కూడా టీఆర్ఎస్ నాయకత్వం ఆహ్వానించింది. ఇప్పటికే జాతీయ పార్టీకి సంబంధించిన ఎజెండాను కూడా కేసీఆర్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అదే రోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా, కేసీఆర్ జాతీయ పార్టీలో కోఆర్డినేటర్లుగా ఎవరికి అవకాశం రానుందో తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News