బీఆర్ఎస్‌తో పొత్తుపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన

ఎన్నికల వేళ కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం ఓ మీడియా ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా 40 సీట్లకే పరిమితం కాబోతోందని అన్నారు.

Update: 2024-02-20 03:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం ఓ మీడియా ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా 40 సీట్లకే పరిమితం కాబోతోందని అన్నారు. ప్రజలు 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలనను చూశారని.. కొత్తగా వారు చేసేది ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. 60 ఏళ్లలో దేశాన్ని కాంగ్రెస్ సర్వనాశనం చేసిందని అన్నారు. తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి కూడా కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్‌కు రాదని షాకింగ్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్ద దెబ్బ తినబోతోందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ మునిగిపోయిన నావ అని చెప్పారు. మునిగిపోయిన నావతో తమకు పొత్తు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో తాము బీఆర్ఎస్ కలవబోము అని స్పష్టం చేశారు. తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. నరేంద్ర మోడీ లాంటి సమర్ధవంతమైన నాయకుడ్ని దేశ ప్రజలు వదులుకోరు అని చెప్పారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 370 పైచిలుకు స్థానాలు గెలుచుకోబోతోందని అన్నారు.

Tags:    

Similar News