‘రియల్’ సంస్థలకు బిగ్ అలర్ట్.. ‘రెరా’ కొత్త చైర్మన్ ఎవరో తెలుసా?

తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులరేటరీ అథారిటీ(టీఎస్ రెరా)కి చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారినే నియమిస్తూ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2023-03-03 14:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులరేటరీ అథారిటీ(టీఎస్ రెరా)కి చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారినే నియమిస్తూ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొద్ది రోజులుగా కొందరు ఐఏఎస్ అధికారుల పేర్లు వినిపించాయి. ఏపీకి వెళ్లి వీఆర్ఎస్ తీసుకున్న సోమేష్ కుమార్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. అలాగే ఇంకొందరు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే రెరా బాధ్యతలను అప్పగించారు.


గతంలోనూ సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించిన సోమేష్ కుమార్ చేతిలోనే ఉండేది. అనేక అవకతవకల రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఆమె ఎలా నియంత్రిస్తుందో వేచి చూడాలి. ప్రధానంగా ప్రీలాంచ్ ఆఫర్లతో రూ.వందల కోట్లు ముందే వసూలు చేస్తున్న బడా కంపెనీలపై చైర్మన్ వైఖరి ఏ విధంగా ఉంటుందోనని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైతే రెరాకి ఎన్ని ఫిర్యాదులు అందినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న అపవాదు ఉన్నది. చైర్మన్ నియామకం తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో మార్పులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది.

Also Read..

తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ గా తారిఖ్ అన్సారీ 

Tags:    

Similar News