పులి బిడ్డను నేను.. YS జయంతి సందర్భంగా Y. S. Sharmila కీలక వ్యాఖ్యలు
తెలంగాణ వ్యాప్తంగా 3, 800 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, ఈ నెలలోనే మళ్లీ ఆ పాదయాత్రను కొనసాగించి 4 వేల కిలో మీటర్లు పూర్తి చేసి.. పాలేరులోనే ముగిస్తానని
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా 3, 800 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, ఈ నెలలోనే మళ్లీ ఆ పాదయాత్రను కొనసాగించి 4 వేల కిలో మీటర్లు పూర్తి చేసి.. పాలేరులోనే ముగిస్తానని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. శనివారం దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు పాలేరులో నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ఇదే పాలేరు మట్టి సాక్షిగా పాలేరు ప్రజలకు వైఎస్ఆర్ సంక్షేమ పాలన అందిస్తానని మాటిస్తున్నానని అన్నారు. రైతులకు అండగా నిలబడతానని, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తానని, పేద బిడ్డల ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీలతో రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తీసుకొస్తానని చెప్పారు. మళ్లీ చెబుతున్నా.. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను.. పులి కడుపున పులే పుడుతుంది.. మీ బిడ్డగా మీకు నమ్మకంగా సేవ చేస్తా.. వైఎస్ఆర్ సంక్షేమ పాలన ప్రతి గడపకు చేరుస్తానని మాటిచ్చారు.