తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్న కీలక నేతలు

తెలంగాణలో ఎంపీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

Update: 2024-05-13 05:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎంపీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. నల్గొండలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి ఓటు వేశారు. కల్లూరు నారాయణపురంలో మంత్రి పొంగులేటి ఓటు వేశారు. సికింద్రాబాద్‌లో ఎంపీ అభ్యర్తి మాధవీలత ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాస్త్రి పురంలో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓటు వేశారు. మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ, వంశీచంద్ రెడ్డిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డిలు ఓటు వేశారు. కరీంనగర్ చైతన్యపురి కాలనీలో బండి సంజయ్, నిజామాబాద్ ప్రగతి నగర్‌లో అర్వింద్ ఓటు వేశారు. నాగార్జున సాగర్‌లో మాజీ మంత్రి జానారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లో హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, సినీ నటుడు నరేష్ ఓటు వేశారు.  


Similar News