‘కాంగ్రెస్‌లో చేరనందుకే వేధింపులు’.. BRS పార్టీ మహిళ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నేత, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. కొమురంభీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడి
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. కొమురంభీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌ను ఎమ్మెల్యే కోవా లక్ష్మి అసభ్య పదజాలంతో దూషించారని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. పోలీసులు తనపై కేసు నమోదు చేయడంపై తాజా ఆమె స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవా లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. ప్రొటోకాల్ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలను అవమానిస్తోందని మండిపడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వప్రసాద్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో ఎమ్మెల్యేనైన తనపైనే అక్రమ కేసులు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరనందుకే నన్ను వేధిస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవా లక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు.