BRS ఇంత తొందరగా పతనం అవుతుందనుకోలేదు.. మంత్రి ఉత్తమ్ సెటైర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండ పర్యటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండ పర్యటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్లగొండకు వచ్చి కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట పచ్చి అబద్ధం అని అన్నారు. కేసీఆర్ ఓడిపోయిన డిప్రెషన్‌లో ఉన్నట్లు కనిపించిందని ఎద్దేవా చేశారు. వరుసగా కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో పార్టీ మిగలదు అనే భయం కూడా కేసీఆర్‌లో మొదలైందని సెటైర్ వేశారు.
రెండో సారి గెలిచాక జాతీయ పార్టీ అన్నారు.. కానీ, ఇంత తొందరగా పతనం అయిన పార్టీని తానెక్కడా చూడాలేదని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనిపించడం కష్టమే అని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఇక ఆ పార్టీలో ఎవరూ కొనసాగడానికి ఇష్టపడటం లేదని అన్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తనకు పరిమిత అధికారమే ఉందని చెప్పారు. దేశంలో పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పంటబీమాను రద్దు చేశారని గుర్తుచేశారు.