ధరణి పోర్టల్ ప్రక్షాళనపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

ధరణి పోర్టల్ ప్రక్షాళనపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-06-14 17:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ధరణి పోర్టల్ ప్రక్షాళనపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడారు. ధరణి పోర్టల్‌పై ఎలాంటి అధ్యయనం చేయకుండా గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిందని.. దీంతో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని తెలిపారు. ధరణి పోర్టల్ సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామని గుర్తు చేశారు. కమిటీ ఫైనల్ రిపోర్టు ఇచ్చే ముందే అన్ని జిల్లాల కలెక్టర్లతో రివ్యూ నిర్వహిస్తామన్నారు. భూవివాదాల పరిష్కారానికి రెవెన్యూ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని, భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలను కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని కమిటీ సూచించిందన్నారు. త్వరలో ధరణి పోర్టల్‌లో కీలక మార్పులు చేయనున్నట్లు స్పష్టం చేశారు.


Similar News