డీమానిటైజేషన్ ఓ విఫల ప్రయోగం: నోట్ల రద్దుపై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

నోట్ల రద్దుపై మంత్రి హరీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ ఓ విఫల ప్రయోగమని.. ఈ విషయాన్ని కేంద్రమే స్వయంగా పార్లమెంట్‌లో ఒప్పుకుందని విమర్శలు గుప్పించారు.

Update: 2023-03-14 11:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: నోట్ల రద్దుపై మంత్రి హరీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ ఓ విఫల ప్రయోగమని.. ఈ విషయాన్ని కేంద్రమే స్వయంగా పార్లమెంట్‌లో ఒప్పుకుందని విమర్శలు గుప్పించారు. డీమానిటైజేషన్‌తో పెద్దనోట్ల చెలామణి తగ్గలేదని.. పెద్ద నోట్ల సంఖ్య తగ్గకపోగా రెండు రెట్లు పెరిగిందన్నారు. అంతేకాకుండా నోట్ల రద్దు తర్వాత డ్రగ్స్ వాడకం, ఉగ్రవాదం భారీగా పెరిగాయని ఆరోపించారు. నోట్ల రద్దుపై ప్రజల్లో భ్రమ కల్పించారని.. అసలు పెద్ద నోట్ల రద్దు లక్ష్యం నెరవేరలేదని పేర్కొన్నారు. అందుకే బీజేపీ నేతలు ఈ విషయంపై పెదవి విప్పడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ చెప్పేదొకటి చేసేది మరోకటని మండిపడ్డారు. అప్పులు తేవడం.. తప్పలు చేయడమే బీజేపీ విధానమని ఎద్దేవా చేశారు. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం నెలకు లక్ష కోట్ల అప్పులు చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. 

Tags:    

Similar News