ప్లూ అని లైట్తీసుకోవద్దు: డాక్టర్ రాజీవ్
మిమ్మల్ని కంటిన్యూగా దగ్గు వేధిస్తున్నదా? వారం కంటే ఎక్కువ రోజులు సతాయిస్తున్నదా? అయితే దీన్ని సాధారణ దగ్గుగా పరిగణించవద్దని సీనియర్ఫల్మనాలజిస్టు డాక్టర్ రాజీవ్సూచించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: మిమ్మల్ని కంటిన్యూగా దగ్గు వేధిస్తున్నదా? వారం కంటే ఎక్కువ రోజులు సతాయిస్తున్నదా? అయితే దీన్ని సాధారణ దగ్గుగా పరిగణించవద్దని సీనియర్ పల్మనాలజిస్టు డాక్టర్ రాజీవ్ సూచించారు. అంతే గాక జలుబు, దగ్గు, జ్వర లక్షణాలు ఉన్నా.. ప్లూ అని లైట్తీసుకోవద్దని ఆయన కోరారు. గత మూడు నెలలుగా దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో దేశ వ్యాప్తంగా బాధితులు పెరుగుతున్నారని, ఇరవై రోజుల నుంచి మన రాష్ట్రంలోనూ పెరిగినట్లు ఆయన సోమవారం మీడియాకు తెలిపారు. దీనిపై ఇప్పటికే ఐసీఎంఆర్(ఇండియన్కౌన్సిల్ ఆఫ్మెడికల్రీసెర్చ్) ఓ అధ్యయనం నిర్వహించి ఇన్ప్లూయెంజా జాతికి చెందిన హెచ్3 ఎన్2 వైరస్ వల్లే ఎక్కువ మందికి వ్యాప్తి జరుగుతున్నట్లు గుర్తించారన్నారు. ఈ వైరస్‌తో సగం మందికి మూడు నుంచి 7 రోజుల్లో సింప్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతున్నదని, కానీ మరి కొంత మంది ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తుందన్నారు.
దగ్గు, జలుబు, గొంతు మంట, వాంతులు, విరేచనాలు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు ఉన్నోళ్లు వెంటనే డాక్టర్లను సంప్రదించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ వైరస్పిల్లలతో పాటు పెద్దలనూ ఎటాక్చేస్తోందన్నారు. అయితే సకాలంలో చికిత్స పొందితే ఎలాంటి శ్వాస సమస్యలు రావన్నారు. డాక్టర్సంప్రదింపు లేకుండా యాంటీ బయాటిక్స్ ను విచ్చలవిడిగా వాడకూడదన్నారు.లక్షణాలు తగ్గేందుకు మందులు వాడితే సరిపోతుందన్నారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా వ్యాధి లక్షణాలుఉన్నోళ్లు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతులు అడ్డుపెట్టుకోవడం, గ్రూప్గేదరింగ్స్లో మాస్కులు వంటివి ధరించాలన్నారు. లక్షణాలు ఉన్నోళ్లు సింప్టమాటిక్ చికిత్స తీసుకుంటూ ద్రవ పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలన్నారు. కొద్ది రోజుల్లోనే ఈ వైరస్ వ్యాప్తికి చెక్‌పడుతుందని ఆయన తెలిపారు.