అయోధ్యకు వెళ్లని వారు దేశ వ్యతిరేకులు కాదు.. బీఆర్ఎస్ MP కేకే కీలక వ్యాఖ్యలు
ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పెల్లిపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత ఆరోపణలపై ఆ పార్టీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు స్పందించారు.
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పెల్లిపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత ఆరోపణలపై ఆ పార్టీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధిస్తుందని చెప్పారు. అన్ని స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలకు గట్టి పోటీ ఇస్తుందని అన్నారు. అయోధ్య రామాయలంపై పార్లమెంట్‌లో తీర్మాణం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. అయోధ్య రామాలయానికి వెళ్లని వారు దేశ వ్యతిరేకులు కాదని అన్నారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా బీజేపీతో ఒప్పందంలో ఉందని ఇటీవల ఎంపీ వెంకటేశ్ నేత ఆరోపించిన విషయం తెలిసిందే.
బీజేపీతో కేసీఆర్ చేతులు కలిపారన్న విషయం పార్టీలో అనేక మందికి తెలుసని అన్నారు. బీఆర్ఎస్ గెలిచే స్థానాల్లో బీజేపీ అంతర్గతంగా మద్దతు ఇవ్వడానికి సిద్ధమైందని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక రాజీనామా చేశానని అన్నారు. 2018లో తనకు రాజకీయంగా జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో నా లక్ష్యాన్ని చేరుకుంటా అని ప్రకటించారు. తాజాగా.. వెంకటేశ్ నేత కామెంట్లపై కేకే స్పందించి కౌంటర్ ఇచ్చారు.