కాంగ్రెస్‌లో చేరికపై BRS ఎమ్మెల్యే కోవా లక్ష్మి కీలక వ్యాఖ్యలు

అధికారం కోల్పోయి కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇటీవల వరుస షాకులు ఇస్తున్నారు. స్టేట్‌లో పవర్ కోల్పోవడం, పార్లమెంట్

Update: 2024-06-27 10:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: అధికారం కోల్పోయి కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇటీవల వరుస షాకులు ఇస్తున్నారు. స్టేట్‌లో పవర్ కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించకపోవడంతో గులాబీ ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్‌లోనే ఉంటే తమ రాజకీయ మనుగడ ప్రమాదంలో పడుతుందన్న భయంతో ఇప్పటి నుండే పక్కదార్లు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం, సంజయ్‌లు బీఆర్ఎస్‌ను వీడి అధికార హస్తం పార్టీ గూటికీ చేరారు. వీరి బాటలోనే మరికొందరు గులాబీ ఎమ్మెల్యేలు పయనించే అవకాశం ఉందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందులో భాగంగానే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పార్టీ మారుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ మార్పు వార్తలపై ఆమె స్పందించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. తను పార్టీ మారుతున్నట్టు వస్తున్న తప్పుడు వార్తలను ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఖండించారు. తాను పార్టీ మారడం లేదని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కొంతమంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక పదవులు అనుభవించి.. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు వెళ్లిపోతున్నారని పార్టీ మారిన నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోవాలక్ష్మి స్పందించడంతో ఎట్టకేలకు ఆమె పార్టీ మార్పు వార్తలకు తెరపడింది.


Similar News