బ్రేకింగ్: పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై సీఎం KCR కీలక ప్రకటన

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (NGT) నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో పెద్ద

Update: 2023-08-15 06:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పర్యావరణ అనుమతులకు నిపుణుల కమిటీ ఆమోదముద్ర వేయడంతో పెద్ద అవరోధం తొలగిపోయిందని అన్నారు. సత్వరమే సాగు నీటి కాల్వల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. అతి త్వరలోనే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని కీలక ప్రకటన చేశారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పరుగులు పెట్టిస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు పచ్చని పైరులతో కళకళలాడుతాయని చెప్పారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు కొందరు కేసులు వేశారని.. కానీ పాలమూరు ప్రాజెక్ట్ అన్నీ అడ్డంకులు దాటుకుందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా గోల్కొండ కోటలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. 

Read more : ఎటు చూసినా ఆకలి కేకలు.. ఆత్మహత్యలే: CM కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Tags:    

Similar News

టైగర్స్ @ 42..