‘కేరళ స్టోరీ’ మూవీ : విశ్వహిందూ పరిషత్ కీలక పిలుపు

"కేరళ స్టోరీ" సినిమాను మనము చూడడమే కాదు.. ప్రతి ఒక్కరికి చూయించాలని విశ్వహిందూ పరిషత్ పిలుపునిచ్చింది.

Update: 2023-05-09 09:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: "కేరళ స్టోరీ" సినిమాను మనము చూడడమే కాదు.. ప్రతి ఒక్కరికి చూయిస్తేనే లవ్ జిహాద్ గురించి, హిందుత్వం పై జరుగుతున్న దాడి గురించి అవగాహన పెరుగుతుందని విశ్వహిందూ పరిషత్ పిలుపునిచ్చింది. ఈ మేరకు వీహెచ్‌పీ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. హిందూ మహిళలపై ప్రేమ పేరుతో జరుగుతున్న దాడి గురించి తెలియజేసే "కేరళ స్టోరీ" చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి, ఆలోచించాలని లవ్ జిహాద్ గురించి అనేక సందర్భాల్లో చర్చించుకుంటున్న విషయం నేడు తెరపైకి వచ్చిందన్నారు. అయితే ఇది సమాజంలోని ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమన్నారు.

కాబట్టి మనకు మనము చూడడమే కాదు.. వీలైనంత ఎక్కువ మందికి సినిమా చూపించాలన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ఇప్పటికే చాలా మంది అభిమానులు తనకు ఫోన్ చేస్తున్నారు . "ఒక షో మొత్తం నేను బుక్ చేస్తాను.. మీరు ఎవరికైనా పంపించండి" అని కొంత మంది ముందుకు వస్తున్నారన్నారు. "కేరళ స్టోరీ" సినిమాను మనము చూడడమే కాదు.. ప్రతి ఒక్కరికి చూయిస్తేనే లవ్ జిహాద్ గురించి, హిందుత్వంపై జరుగుతున్న దాడి గురించి అవగాహన పెరుగుతుందని, కాబట్టి మీ స్థాయిలో మీరు పక్కవారికి సినిమా చూపించే ప్రయత్నం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఎన్ని టికెట్లు బుక్ చేస్తారో.. ఆ వివరాలు తన నెంబర్‌కు 9912975753 పంపాలని పేర్కొన్నారు. కళాశాల విద్యార్థులను.. మీడియా మిత్రులను.. సమాజంలో ఉన్నటువంటి అందరికీ సినిమాను చూపించే ప్రయత్నం చేద్దామన్నారు. 

Also Read..

మళ్లీ అవే ముఖాలు.. కేరళ స్టోరీపై కుట్ర చేస్తున్నాయి: అనుపమ్ ఖేర్

Tags:    

Similar News