ప్రేమించి దూరం పెడుతుందని.. మరదలిని అత్యాచారం చేసి..

మైనర్ బాలిక అయిన తన మరదలు ప్రేమించిన తనను దూరం పెడుతోందని కక్ష పెంచుకుని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది.

Update: 2023-04-18 03:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: మైనర్ బాలిక అయిన తన మరదలు ప్రేమించిన తనను దూరం పెడుతోందని కక్ష పెంచుకుని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన శంషాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ బాలిక మేనమామ కొడుకు విష్ణుతో కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది. అయితే కొద్ది రోజులుగా దూరం పెట్టింది. మరొకరితో సన్నిహితంగా ఉంటోంది. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేక విష్ణు శంషాబాద్ మధురానగర్ లోని ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బండరాయితో బలంగా మోది మైనర్ బాలికను హత్య చేశాడు. ఈనెల 11న మర్డర్ చేయగా 14న బాలిక మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెంలో అరెస్ట్ చేశారు. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..