కేసీఆర్ నెక్ట్స్ బర్త్ డే జైల్లోనే.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

అవినీతి డబ్బుతో నేడు ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారని, కేసీఆర్‌కు ఇది చివరి పుట్టిన రోజని, వచ్చే బర్త్‌ డే

Update: 2023-02-17 14:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అవినీతి డబ్బుతో నేడు ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారని, కేసీఆర్‌కు ఇది చివరి పుట్టిన రోజని, వచ్చే బర్త్‌ డే జైల్లోనే జరుపుకుంటారని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రవీంద్ర నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ వేసిన బిస్కెట్లు తిని కొంతమంది బానిసలు తమ నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇన్నేళ్లలో కేసీఆర్ ఎటువంటి అభివృద్ధి చేయకుండా పిట్ట కథలు చెబుతూ వచ్చారని, వీటి మీద ఆ బానిసలు కేసీఆర్‌ను ఎప్పుడైనా ప్రశ్నించారా? అని నిలదీశారు. ప్రభుత్వ హాస్టల్లో ఆడపిల్లల అవసరానికి నీళ్లు దొరకని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బాగా ఎగురుతున్నారని, కేసీఆర్ దళిత, గిరిజన వర్గాలను అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిడ్డ గువ్వల.. నీ గుప్తనిధుల సినిమా తీస్తాం: కొప్పు బాషా

ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా మాట్లాడుతూ.. బండి సంజయ్ పట్ల ఇటీవల అధికార పార్టీ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యే‌లు మాట్లాడిన భాష తెలంగాణ సమాజం సిగ్గు పడేలా ఉందన్నారు. వారికి బీజేపీ మీద మాట్లాడే నైతిక హక్కు లేదని తేల్చిచెప్పారు. గువ్వల, రేగా చేస్తున్న అరాచకాలు, బ్లాక్ దందాలు అందరికీ తెలుసన్నారు. గువ్వల రెండు లక్షలు లంచం తీసుకునే వరకు దళితబంధు ఇవ్వట్లేదని ఆరోపించారు. అచ్చంపేట అడవిలో ఉన్న శివాలయాలను ఎందుకు తవ్వుతున్నావని ప్రశ్నించారు. 'బిడ్డ గువ్వల రాబోయే రోజుల్లో మీ మీద సినిమా తీస్తాం' అని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు నీ ఆస్తి ఎంత? ఇప్పుడేంతా? అని ప్రశ్నించారు. గుప్త నిధుల కోసం తవ్వే బ్యాచ్ రాష్ట్రంలో ఉందని, దానికి అధ్యక్షుడే గువ్వల బాలరాజు అని విమర్శించారు.



 


Tags:    

Similar News

టైగర్స్ @ 42..