'కేసీఆర్ కలలు కలలుగానే మిగిలిపోతాయి'
తెలంగాణ సమస్యలు, ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. కేసీఆర్ ముందు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సమస్యలు, ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. కేసీఆర్ ముందు రైతు రుణమాఫీ చేసి ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అనేది రైతుల కోసం కాదని తన పరివారం కోసమే పెట్టారని ఆరోపించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన నేపథ్యంలో శనివారం స్పందించిన రామచంద్రరావు.. బీఆర్ఎస్ నినాదం ఆబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ కాదని అబ్ కి బార్ బి మేరా పరివార్ కా సర్కార్ కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తన కుటుంబానికి ఉన్న ఆకాంక్షల కోసం బీఆర్ఎస్ పెట్టారని ధ్వజమెత్తారు.
తెలంగాణలో ఏ గుణాత్మక మార్పు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర పథకాలు రాష్ట్ర ప్రజలకు చేరువ కాకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నాడని టీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇస్తారనే భయంతో బీఆర్ఎస్ పేరుతో మరో ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, అత్యాచారాలు, కిడ్నాప్ లు పెరిగిపోయాయని ఆరోపించారు. కేసీఆర్ కలలు కలలుగానే ఉంటాయని బీఆర్ఎస్ గుర్తింపు పొందలేదని అన్నారు. రైతులు బీజేపీ వెంట ఉన్నారని రైతాంగా సమస్యలను బీజేపీ పరిష్కరిస్తుందని చెప్పారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టుకోవడానికి ఎవరికి అభ్యంతరాలు లేవన్న రామచంద్రరావు.. ఎవరైనా పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిందన్నారు. ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందలేవని, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు రావడానికి 12 ఏళ్ల సమయం పట్టిందన్నారు. ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా మారకముందే టీఆర్ఎస్ అవినీతి జాతీయ స్థాయికి చేరిపోయిందని ఆ పార్టీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందలేదన్నారు. బీఆర్ఎస్ కు కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి మద్దతు ప్రకటించడంపై సెటైర్లు వేశారు. కుమార స్వామి కర్ణాటకలో గతంలో కాంగ్రెస్, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
Also Read: 'కేంద్రం నిధులు వినియోగించుకోవడంలో తెలంగాణ ఫెయిల్'సీఎం