కేసీఆర్ బిగ్ స్కెచ్.. 8 అంశాలతో సభలో కాంగ్రెస్ ను కార్నర్ చేసే ప్లాన్

అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ ఖతర్నాక్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.

Update: 2024-07-23 10:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ భవన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్, హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సభ్యులకు కీలక దిశానిర్దేశం చేయనున్న ఈ మీటింగ్ కు ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు గైర్హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ళ పద్మారావు గౌడ్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, గోరేటి వెంకన్న, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఈ మీటింగ్ కు డుమ్మా కొట్టారు. వీరిలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే రుణమాఫీ స్కీమ్ అమలుతో దూకుడుమీదున్న అధికార కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు కీలకమైన దిశానిర్దేశం చేయనున్న ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. ఓ వైపు ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఎవరు ఎప్పుడు కారు దిగి కాంగ్రెస్ లో చేరుతున్నారో చివరి నిమిషం వరకు సస్పెన్స్ గా మారుతున్న నేపథ్యంలో కేసీఆర్ మీటింగ్ కు పార్టీ ప్రజాప్రతినిధులు ఆబ్సెంట్ కావడం చర్చనీయాశం అవుతున్నది.

అంశాల వారీగా ఫైట్:

సభలో అధికార పక్షాన్ని అంశాల వారిగా చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తున్నది. ఇందులో భాగంగా మొత్తం 8 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం చెప్పిన వందరోజుల గడువు ముగిసిపోవడంతో ప్రభుత్వ వైఫల్యాలను సభా వేదికగా ఎండగట్టాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా ఎనిమిది అంశాలపై ప్రధానంగా అధికారపక్షాన్ని కార్నర్ చేసేందుకు కేసీఆర్ అస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ సమావేశంలో సభ్యుల సూచనలు పరిగణలోకి తీసుకుని మరికొన్నింటిని ప్రస్తావించే అవకాశం ఉంది.

సభలో బీఆర్ఎస్ లేవనెత్తే అంశాలు ఇవే:

1)నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు -జాబ్ కేలండర్ విడుదల కోరుతూ ఉద్యమించిన ఉద్యోగార్ధుల పై ప్రభుత్వ దమనకాండ

2) రాష్ట్రం లో శాంతి భద్రతల నిర్వహణ లో వైఫల్యం

3 )రాష్ట్రం లో చేనేత కార్మికుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి

4 )ఆరు గ్యారంటీల అమలు.. శాసన సభలో చట్టబద్దత

5 )రైతు రుణ మాఫీ అమల్లో ఆంక్షలు-నష్టపోతున్న రైతాంగం

6 )పంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపు పై ప్రభుత్వ వైఫల్యం - రైతు భరోసా చెల్లింపులో జాప్యం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు

7 ) గ్రామాలు ,పట్టణాలకు నిధుల విడుదలలో అలసత్వం-పారిశుధ్య నిర్వహణ సరిగా లేక కుంటు పడుతున్న ప్రజారోగ్యం

8 )ఫీజు రీ యింబర్స్ మెంట్ బకాయిల విడుదలలో జాప్యం ఫలితంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు

Tags:    

Similar News