Hyderabad: పోలీసుల తీరుపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం

లగచర్ల(Lagacharla) బాధిత రైతుల పరామర్శకు వెళ్తున్న సమాచారం మేరకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(MP Konda Vishweshwar Reddy)ని పోలీసులు ముందస్తుగా హైదరాబాద్‌లో తన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు.

Update: 2024-11-18 15:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: లగచర్ల(Lagacharla) బాధిత రైతుల పరామర్శకు వెళ్తున్న సమాచారం మేరకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(MP Konda Vishweshwar Reddy)ని పోలీసులు ముందస్తుగా హైదరాబాద్‌లో తన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. దీంతో కొండా విశ్వేశ్వర రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కొండా తన ఇంట్లోనే నేషనల్ హైవే పనులపై రివ్యూ కొనసాగించారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు పెండింగ్‌లో ఉన్న బీజాపూర్ జాతీయ రహదారి రోడ్డు పనుల పురోగతిపై ఎన్‌హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వర్ రావు, ఆర్ అండ్ బీ ఈఈ ధర్మారెడ్డి, ఎన్‌హెచ్ఏఐ అధికారులు, చేవెళ్ల బీజేపీ నాయకులతో సమీక్ష నిర్వహించారు.

రోడ్డు పనుల ఆలస్యానికి కారణాలను కొండా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలస్యం చేయకుండా త్వరగా పనులు ప్రారంభం చేసి రోడ్డు ప్రమాదాల బారి నుంచి ప్రజలను కాపాడాలని అధికారులకు సూచించారు. దీనికి అధికారులు సమాధానం చెబుతూ రాబోయే రెండు వారాల్లో పనులు ప్రారంభం చేసి యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, కొండా రాందేవ్ రెడ్డి, మల్గారి రమణ రెడ్డి, టీఏసీ కమిటీ మెంబర్ మాణిక్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశ్వేశ్వర రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో ఎంపీలు ఈటల, డీకే అరుణ సంగారెడ్డికి బయలుదేరి వెళ్లారు.

Tags:    

Similar News